హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగశౌర్య (Nagashaurya). దర్శన్ చాలా మంచి వాడంటూ ఆయన ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. నాగశౌర్య పోస్ట్ కు నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నాగశౌర్య దర్శన్ తో కలిసి ఉన్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగశౌర్య దర్శన్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది.

దర్శన్ ను బ్రదర్ లా భావిస్తాడు నాగశౌర్య. పలు సందర్భాల్లో వీరు కలిశారు. ఈ పరిచయంతోనే దర్శన్ నిర్దోషి అని, అతనికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని నాగశౌర్య తన పోస్ట్ లో పేర్కొన్నాడు. తన స్నేహితురాలు పవిత్ర గౌడ (Pavitra gowda)ను వేధిస్తున్నాడనే కారణంతో రేణుకాస్వామి (Renukaswamy) అనే వ్యక్తిని దర్శన్ కిడ్నాప్ చేయించి హత్య (Kidnapa and murder) చేయించాడని కేసు నమోదైంది. ఈ హత్యలో దర్శన్, పవిత్ర గౌడ పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.