Published on Dec 24, 2024 5:04 PM IST
ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్న నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన “గేమ్ ఛేంజర్” అని చెప్పాలి. మరి భారీ హైప్ ఉన్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన ఒకో సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మరి శంకర్ సినిమాలు అంటే సాంగ్స్ వాటి తాలూకా విజువల్స్ ఏ లెవెల్లో ఉంటాయో అందరికీ తెలిసిందే.
మరి అలాగే గేమ్ ఛేంజర్ కి కూడా శంకర్ తన మార్క్ వినూత్నత చూపిస్తూ చాలా కొత్తగా పాటలని ప్లాన్ చేశారు. మరి శంకర్ సినిమాల్లో పాటలకి కూడా రికార్డు బడ్జెట్ అవుతుంది. ఇలానే గేమ్ ఛేంజర్ కోసం కూడా భారీ బడ్జెట్ ని పెట్టారట. దీనితో గేమ్ ఛేంజర్ కి గాను ఏకంగా 92 కోట్లకి పైగానే బడ్జెట్ ఒక్క పాటలకే పెట్టినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ టాక్ ఇపుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.