Sandhya Theater Case  : సంధ్య థియేటర్‌ కేసులో A1 నుంచి A18వరకు ఎవరెవరంటే..?

  • సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసుపై పోలీసుల విచారణ
  • A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం, మేనేజర్
  • A9, A10 సంధ్య థియేటర్‌ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌చార్జ్‌
  • A12 నుంచి A17వరకు అల్లు అర్జున్‌ బౌన్సర్లు
  • A18గా మైత్రి మూవీమేకర్స్‌ను చేర్చిన పోలీసులు
  • ఇప్పటికే A11గా అల్లు అర్జున్‌ను చేర్చిన పోలీసులు

Sandhya Theater Case : సంధ్య థియేటర్‌ ఘటన సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బెయిల్‌పై ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్‌ను ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసులు, కట్టుదిట్టమైన భద్రతతో, సెషన్ తర్వాత నటుడిని తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విచారణ ముగిసిన వెంటనే తన కారులో ప్రాంగణం నుండి వెళ్లిపోయాడు. అయితే.. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. తన న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు, అల్లు అర్జున్‌ దర్యాప్తు అధికారుల నుండి వరుస ప్రశ్నలను ఎదుర్కొన్నారు.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే.. తాజాగా ఈ కేసులో విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం, మేనేజర్‌ను చేర్చారు పోలీసులు. అంతేకాకుండా.. A9, A10 సంధ్య థియేటర్‌ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌చార్జ్‌ను చేర్చిన పోలీసులు.. A12 నుంచి A17వరకు అల్లు అర్జున్‌ బౌన్సర్లు చేర్చారు.. అయితే.. A18గా మైత్రి మూవీమేకర్స్‌ను పోలీసులు చేర్చినట్లు వెల్లడించారు.. అయితే… ఇప్పటికే A11గా అల్లు అర్జున్‌ను కేసులో చేర్చిన విషయం తెలిసిందే..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *