Sritej Father Bhaskar : అల్లు అర్జున్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది.. కేసు వాపస్‌ తీసుకుంటా..!

  • నిన్నమొన్నటి నుంచి కొంచం బెటర్‌గా ఉన్నాడు
  • 48 గంటలు అయ్యింది వెంటిలేటర్ తీసేశారు
  • గత కొన్ని రోజులుగా చాలా దారుణంగా ఉంది అతని హెల్త్ కండిషన్ : శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌

Sritej Father Bhaskar : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజుకు రోజుకు అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్నారు. ఈ మధ్య, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. నిన్నమొన్నటి నుంచి కొంచం బెటర్ గా ఉన్నాడని ఆయన తెలిపారు. 48 గంటలు అయ్యింది వెంటిలేటర్ తీసేశారని, గత కొన్ని రోజులుగా చాలా దారుణంగా ఉంది అతని హెల్త్ కండిషన్, రెండ్రోజులుగా కదలికలు ఉన్నాయన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌.

Maoist Arrest : ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత అరెస్ట్

పుష్ప ప్రొడ్యూసర్ 50 లక్షలు ఇచ్చారని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు, అల్లు అర్జున్ 10 లక్షలు ఇచ్చారని ఆయన తెలిపారు. సెకండ్ డే నుంచి మాకు సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఇచ్చారని, అల్లు అర్జున్ సైడ్ నుంచి సపోర్ట్ ఉందన్నారు. అందుకే కేసు వాపసు తీసుకుంటాను అని చెప్పినని, నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మా వైఫ్ నాకన్నా ముందు లోపలికి వెళ్ళిపోయిందని, లోపల ఏమైంది అని నాకు తెలియదన్నారు భాస్కర్‌. పాపను వదిలేసి వాచ్చే లోపు ఇదంతా జరిగిందని, మా ట్రీట్మెంట్ మేము చేస్తాం అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారని భాస్కర్ తెలిపారు.

PM Modi: రేపు మధ్యప్రదేశ్‌లో మోడీ పర్యటన.. కెన్-బెత్వా నదుల లింక్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *