Published on Dec 24, 2024 8:00 PM IST
మన ఇండియన్ సినిమా దగ్గర దాదాపు అన్ని జానర్ సినిమాలు కూడా మనం టచ్ చేసేసాం. అయితే వైలెంట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాత్రం వచ్చిన చిత్రాల్లో చూసుకున్నట్టయితే వీటిలో కూడా చాలా ఉంటాయి కానీ వీటిలో కూడా ఇక ఆడియెన్స్ కి ఒక మ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన సినిమాలు చెప్పమంటే మన దగ్గర తక్కువే ఉంటాయి.
మరి రీసెంట్ గా అలాంటి ఒక మ్యాడ్ ఎక్స్ పీరీయెన్స్ ని అందించిన చిత్రమే “కిల్”. బాలీవుడ్ సినిమా నుంచి ఆ హీరో ఎవరో తెలీదు హీరోయిన్ కూడా పెద్దగా పరిచయం లేదు కానీ సినిమా చూసిన వారు అంతా ఇండియన్ సినిమా దగ్గర బెస్ట్ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ అని కొనియాడారు.
కానీ లేటెస్ట్ గా మరో సాలిడ్ వైలెంట్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈసారి సినిమా మళయాళం నుంచి వచ్చింది. ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రంలో “మార్కో”. ఈ సినిమాపై కూడా ఇపుడు సాలిడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యింది. దీనితో కిల్ తర్వాత మళ్ళీ చాలా మంది ఈ సినిమా కోసం మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు.