Published on Dec 25, 2024 2:59 AM IST
నటసింహం బాలయ్య బాబుని సరికొత్తగా చూపించిన టాక్ షో.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ప్రస్తుతం 4వ సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ షోకు విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ షోలో పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో తాను కూడా గ్యాంగ్ మెయింటైన్ చేశానని, చాలా అల్లరి పనులు చేశానని వెంకటేష్ చెప్పడం విశేషం.
వెంకటేష్ ఇంకా మాట్లాడుతూ.. తన తండ్రి రామానాయుడు గురించి మాట్లాడుతూ. వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు వెంకీ. మొత్తానికి బాలయ్య- వెంకీల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఫుల్ ఫన్ తో సాగిందని అర్ధం అవుతుంది. కాగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.