- అనుష్క శెట్టి డైరెక్టర్ క్రిష్ కాంబోలో ‘ఘాటి’
- సరికొత్త నేపథ్యాన్ని తీసుకున్న డైరెక్టర్ క్రిష్
- అనుష్క పాత్రతో పాటు మరో స్పెషల్ రోల్ కూడా
Ghaati : అనుష్క శెట్టి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా. అనుష్క పుట్టినరోజును సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. పోస్టర్‌లో, అనుష్క తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది, ఆమె నుదిటిపై బిందీతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్ గా అనిపించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also:Kannappa : కనప్పపై ఆసక్తి పెంచుతున్న యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియో
ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈ సినిమా కోసం క్రిష్ సరికొత్త నేపథ్యాన్ని తీసుకున్నారు. మూవీలో అనుష్క పాత్రతో పాటు మరో స్పెషల్ రోల్ కూడా ఉంటుందని.. ఈ నెగిటివ్ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ‘రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో’లో అనుష్క చీర కట్టుకుని తలపై ముసుగు వేసికొని నడుస్తూ వెళ్తున్నట్లు చూపించారు. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.
Read Also:IND W vs WI W: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం