Auto Johnny : మళ్లీ తెరపైకి ఆటోజానీ.. సెకండ్ ఆఫ్ ఛేంజ్ చేస్తున్న పూరీ

  • మళ్లీ పట్టాలెక్కనున్న ఆటోజానీ
  • చిరంజీవి కోరిక మేరకు సెకండ్ ఆఫ్ ఛేంజ్ చేస్తున్న పూరీ
  • గోపీచంద్ తో సినిమా తర్వాత సెట్స్ పైకి ఆటోజానీ

Auto Johnny : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు పదేళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఆయన కంబ్యాక్ వాస్తవానికి డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌ర‌గాల్సింది. కానీ అప్పుడ‌ది వీలుకాలేదు. పూరి వ‌ద్ద స‌రైన క‌థ సిద్దంగా లేక‌పోవ‌డంతో ఆ అవకాశం ఖైదీ నం.150తో వి.వి.వినాయ‌క్ కు వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిరంజీవితో సినిమా చేసేందుకు పూరి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఆటోజానీ’ స్టోరీ వినిపించారు. ప్రధ‌మార్ధం క‌థ వ‌ర‌కూ ఒకే ..కానీ సెకండాఫ్ బాగోలేదని చిరంజీవి మార్పులు సూచించారు. కానీ ఆ మార్పుల‌తో పూరి మ‌ళ్లీ అప్రోచ్ అవ్వలేదు. అలా సంవత్స‌రాల కాలం గ‌డిచిపోయింది. ఈ ప్రాసెస్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్ల‌తో సినిమాలు చేసారుగానీ పూరి తో మాత్రం సినిమా చేయలేకపోయారు. చివరికి చిరంజీవి కోర‌డంతో గాడ్ ఫాద‌ర్ సినిమాలో పూరి నే ఓ చిన్న గెస్ట్ రోల్ చేశారు. అన్నయ్య మాట కాద‌న‌లేక పూరి తొలిసారి ఓ సినిమాలో గెస్ట్ అపీరియ‌న్స్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మ‌ధ్య ఆ బాండింగ్ అలాగే ఉంద‌ని అభిమానుల‌కు అర్థం అయింది. అయితే పూరి ఇప్పుడు మ‌ళ్లీ ‘ఆటోజానీ’ని తెర‌పైకి తెస్తున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం.

Read Also : PV Sindhu Reception: కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!

మెగాస్టార్ కోరిక మేర‌కు ‘ఆటోజానీ’ క‌థ సెకండాఫ్ లో పూర్తి మార్పులు చేస్తున్నారట పూరీ. ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప‌నులు ప్రారంభించారట. తొలుత గోపీచంద్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ క‌థ రెడీగా ఉందట. కానీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందట. ఈ గ్యాప్ లో ‘ఆటోజానీ’ క‌థ‌లో మార్పుల‌కు క‌లం ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి ఫోక‌స్ అంతా ఆ సినిమాపైనే ఉంద‌ంటున్నారు. స్టోరీలు రాయ‌డంలో పూరి వెరీ ఫాస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయ‌న ఎక్కువ‌గా స‌మ‌యం తీసుకుని రాసినా? తీసుకోకుండా రాసినా? స‌రైన లైన్ దొరికిందంటే ఇట్టే కథ అల్లేస్తారు. మెగాస్టార్ తో పూరి సినిమా అన్నది ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నారు. 150 కాక‌పోతే 160 అని..క‌చ్చితంగా అన్నయ్యతో సినిమా తీసి తీరుతాన‌ని అప్పట్లోనే స‌వాల్ విసిరారు. అందుకు స‌మ‌యం ఇప్పుడు ఆసన్నమైంది. పూరి కంబ్యాక్ ‘ఆటో జానీ’తో గ్రాండ్ గా ఉంటుంద‌ని తన స‌న్నిహితులు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

Read Also :Astrology: డిసెంబర్ 25, బుధవారం దినఫలాలు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *