- కలెక్షన్ల పరంగా పుష్ప 2 సంచలనం
- ప్రపచంవ్యాప్తంగా రూ.1600 కోట్ల గ్రాస్
- బడా హీరోకి కూడా సాధ్యంకాని కలెక్షన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. మూడోవారం వీకెండ్‌లో కూడా ఏకంగా 72 కోట్లకు పైగా వసూలు చేసింది. బడా చిత్రాల ఓపెన్సింగ్స్‌కు సైతం ఇంత కలెక్షన్స్ రాలేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లోనే రూ.1500 కోట్లు రాబట్టిన పుష్ప 2.. ఇప్పటి వరకు ప్రపచంవ్యాప్తంగా రూ.1600 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది. దీంతో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన మూడో ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలిచింది. దంగల్ రెండు రూ.2000 కోట్లు, బాహుబలి రూ.1800 కోట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ ఉండడంతో పుష్ప 2 కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ పుష్ప 2 హిందీ కలెక్షన్స్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ బడా హీరోకి కూడా సాధ్యంకాని వసూళ్లను రాబట్టి.. ఆల్ టైం రికార్డును పుష్ప 2 క్రియేట్ చేసింది. హిందీ సినిమాలలో 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో ‘స్త్రీ 2’ టాప్ ప్లేస్‌లో ఉంది. కానీ ఇప్పుడు పుష్ప 2 ఏకంగా 700 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక్క హిందీలోనే రూ.704 కోట్లు రాబట్టింది పుష్ప 2. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలకు పుష్పరాజ్ పెద్ద టార్గెట్ ఇచ్చాడనే చెప్పాలి.
ఇక హిందీలో దూసుకుపోతున్న పుష్ప 2ని 3డి వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తెస్తున్నట్టుగా మేకర్స్ తాజాగా తెలిపారు. 3డి వెర్షన్ కూడా అదరగొట్టే వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఏదేమైనా బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 ఓ సంచలనం అనే చెప్పాలి. ఇక జనవరి రెండో వారంలో పుష్ప 2 ఓటీటీకి రానున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ ట్రెండ్ అయింది. ఆ వార్తలపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. థియేటర్ రిలీజ్ 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ రిలీజ్ కాదని స్పష్టం చేసింది.