సంధ్య థియేటర్ తొక్కిసలాట లో గాయపడిన శ్రీ తేజ నీ కిమ్స్ ఆసుపత్రిలో అల్లు అరవింద్, దిల్ రాజ పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ” వైద్యులను శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై అడిగాము, వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అని అన్నారు. విపత్తు అనంతరం ఆ అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను. కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వాలని అనుకున్నాం. అందులో భాగంగా శ్రీతేజ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు.. మైత్రీ నిర్మాతలు రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు ఇస్తున్నాం. ప్రభుత్వ ప్రతినిధిగా దిల్ రాజుకి ఇస్తున్నాం’ ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన మేము అండగా ఉంటాం’ అని అన్నారు.
T FDC చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ” శ్రీతేజ వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండా 72 గంటలుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. అల్లు అర్జున్, నిర్మాతలు, డైరెక్టర్ తరపున రూ. 2 కోట్ల రూపాయలు అందజేజేశారు. అలాగే రేపు సీఎం రేవంత్‌రెడ్డిని ఇండస్ట్రీలోని సినీ పెద్దలతో కలవబోతున్నాం. హీరోలు, దర్శకులు, నిర్మాతలు రేపు ఉదయం 10 గంటలకు సీఎంను కలవబోతున్నాం. సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటా, ఇండస్ట్రీ మేలుకోరి పని చేస్తాను. రేపు ముఖ్యమంత్రితో భేటీ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తాం’ అని అన్నారు.