Published on Dec 26, 2024 3:59 PM IST
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అభిమానులను అలరించింది. ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ సినిమా సాలిడ్ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.
‘దేవర’ చిత్రాన్ని జపాన్ దేశంలో మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘కల్కి 2898 ఎడి’ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్, ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనుంది. ఇక ‘దేవర’ చిత్ర ప్రీ-సేల్స్‌ను జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు.
జపాన్‌లో ఎన్టీఆర్‌కు సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ‘దేవర’ సినిమాకు కూడా జపాన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘దేవర’ చిత్రంలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.