గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లని హీరోలుగా పెట్టి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం RRR కోసం అందరికీ తెలిసిందే. మరి గ్లోబల్ లెవెల్లో సంచలనం సెట్ చేసిన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు అంతకు మించిన గౌరవాన్ని తెలుగు సినిమాకి పట్టుకొచ్చింది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ పై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని మేకర్స్ మొదట థియేటర్స్ లో వదిలిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి RRR బిహైండ్ అండ్ బియాండ్ అంటూ సాగే ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు రిలీజ్ కి తీసుకొచ్చేసారు. మరి మొన్న థియేటర్స్ లో చూడకుండా ఓటీటీలో చూద్దాం అనుకున్నవారు ఇపుడు ట్రై చేయవచ్చు.
The post ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “RRR” బిహైండ్ & బియాండ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.