- వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
- రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ
- తదుపరి విచారణను వచ్చే సోమవారం కి వాయిదా వేసిన కోర్టు
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరు అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. అల్లు అర్జున్ నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సి ఉండగా, ఆయన న్యాయవాదులు ఆన్‌లైన్‌లో హాజరు కావాలని కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తి అనుమతితో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు అయ్యారు.
Read Also:Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
ఇదే కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు విచారణకు హాజరు అయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. అల్లు అర్జున్ కోర్టుకు వస్తారనే సమాచారంతో మొదట అక్కడ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో తదుపరి విచారణను నాంపల్లి కోర్టు వచ్చే సోమవారం కి వాయిదా వేసింది.
Read Also:Mahesh Kumar Goud: జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు..