Child Artists : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్టులు..

అమ్మాయిలు ఊరికే ఎదిగేస్తారు అంటుంటారు. వీరిని చూస్తే నిజమేనేమో అనిపించకమానదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టెలికాస్ట్ అవుతుండగానే అవికాగోర్ ఉయ్యాల జంపాల అంటూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వావ్ అనిపించింది. ఇలాగే ట్విస్ట్ ఇచ్చింది అవంతిక వందనపు. అమ్మ చేసింది మిస్ చాలా లైట్‌గానే ఉంటుందని తన ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసిన అవంతిక ఏకంగా హాలీవుడ్ చిత్రాల్లో హాట్‌గా కనిపించి ఏంటీ మన అమ్మాయేనా అనేలా బుగ్గలు నొక్కుకునేలా మారిపోయింది.

ఇప్పుడు వీళ్ల జాబితాలోకి చేరిపోయింది అనిఖా సురేంద్రన్. ఎన్నై అరిందాల్‌లో అజిత్ కూతురిగా కనిపించిన అనిఖా సురేంద్రన్ కట్ చేస్తే బుట్టబొమ్మతో హీరోయిన్ అయిపోయింది. ధనుష్ తన మేనల్లుడు పవీష్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తోన్న నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నాడి కోబంలో ఈ భామనే హీరోయిన్. విక్రమ్ నాన్నలో గుండెల్ని పిండేసే యాక్టింగ్ చేసిన పాప సారా అర్జున్ కూడా టీనేజ్ బోర్డర్‌కు వచ్చేసింది. మొన్న90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో శివాజీ కూతురిగా కనిపించిన వాసంతిక కూడా ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజ్ అయ్యింది. హాయ్ తార ప్రైవేట్ ఆల్బమ్, వెరో లెవల్ ఆఫీస్ లాంటి సిరీస్‌ల్లో కీ రోల్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇక నాని గ్యాంగ్ లీడర్‌లో స్వాతి క్యారెక్టర్‌లో కనిపించిన శ్రియ కొంతం కూడా ఇప్పుడు హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు నిద్రకు భగ్నం చేసే శ్రియ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మెయిన్ రోల్ చేస్తుంది. ఇదే కాదు.. సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న మూవీకి కూడా ఫిక్సైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు గ్రోన్ అప్ యంగ్ హీరోలతో జోడీ కడుతున్న ఈ యంగ్ బ్యూటీలు ఫ్యూచర్‌లో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *