రాజమౌళి సినిమా కమిటయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్‌లో చూడలేం.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే పవర్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రావడం కష్టమే.!
రామ్ చరణ్ బ్రేక్స్ తీసుకుంటూ షూటింగ్‌కు వస్తున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం అంతా లొకేషన్స్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా సీనియర్స్ కూడా సెట్స్‌లో సెట్ అయిపోయారు. ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు.
ఓ వైపు కల్కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కోసం దేశమంతా తిరిగేస్తున్నారు రెబల్ స్టార్. ఆ మధ్య చిన్న బ్రేక్ తీసుకున్న చిరంజీవి.. విశ్వంభరతో మళ్లీ బిజీ అయ్యారు. వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ దేవర కీలక షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ RFCలో జరుగుతుంది.
మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ మధ్యే బాబీ సినిమా లొకేషన్లోకి ఎంట్రీ ఇచ్చారు. NBK 109 షూట్ ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో జరుగుతుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వంతో పాటు రామ్, పూరీ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ షూట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది.
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా షూట్ తుక్కు గూడలో జరుగుతున్నాయి. నాగార్జున, ధనుష్ నటిస్తున్న కుబేరా షూటింగ్ ఒకేసారి ముంబైతో పాటు ఉప్పల్‌లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్.