తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమమయి గానే కాదు త్యాగమూర్తిగా కూడా ఆమెకు సాటి రారు మరెవ్వరు. అలాంటి ఓ తల్లి మనసు ఎలాంటి భావోద్వేగాలకు గురైంది. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాల సమ్మేళనంతో “తల్లి మనసు” అనే చిత్రాన్ని రూపొందించారు.
రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా.. పలువురు దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన వి.శ్రీనివాస్(సిప్పీ) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రమిది.
ఇటీవల షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేస్తూ.. “సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం. సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేశాం. అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమాను నవంబర్ నెలలో రిలీజ్ చేస్తాం.” అని చెప్పారు.
The post “తల్లి మనసు” టీజర్ రిలీజ్.. నవంబర్‌లో మూవీ రిలీజ్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.