Pawan Kalyan’s Reaction to Allu Arjun’s Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్..

  • హీరో అల్లు అర్జున్‌ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే
  • ఈ ఘటనపై ఫైర్ అయిన సీఎం రేవంత్
  • తాజాగా అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌ లో హీరో అల్లు అర్జున్‌ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. అల్లుఅర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్డుకు తరలించారు. ఒక రాత్రి జైల్లో గడిపిన అల్లు అర్జున్ మరునాడు విడుదలయ్యారు.

READ MORE: Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..

అల్లు అర్జున విడుదల అనంతరం.. పలువురు సినీ ప్రముఖులు ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించడంతో విషయం కాస్త.. పెద్ద దైంది… సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వల్లే జరిగిందని సీఎం ఫైర్ అయ్యారు. పోలీసులు చెప్పిన వినలేదన్నారు. మరో వైపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన సిని ప్రముఖులపై కూడా ఫైర్ అయ్యారు.

READ MORE: TG Assembly: 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఎంపీడీవో, కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్న సంధించారు. అల్లు అర్జున్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై మీ స్పందని ఏంటని ప్రశ్నించారు.

READ MORE: Perni Nani: కొద్ది రోజులుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..

రిలవెంట్ ప్రశ్నలు అడగాలని.. ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? అని పవన్ కళ్యాణ్ అన్నారు. “కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి.. పెద్దగా ఆలోచించండి” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయని.. వాటి గురించి అడగాలన్నారు. సినిమాలు కాకుండా వేరే విషయాలపై డిబెట్ ఉండాలన్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *