2024 క్రియేటివ్ ఇండస్ట్రీ మాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్. 96 ఏళ్ల మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది హిస్టరీ క్రియేట్ చేసింది. రేర్ రికార్డులు సొంతం చేసుకుంది. పాన్ ఇండియన్ చిత్రాలు తీయనప్పటికీ వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కించుకున్న సినిమాలిచ్చింది. ఒకప్పుడు ఏ గ్రెడెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన కేరళ ఇండస్ట్రీ.. ఇప్పుడు కంటెంట్ బేస్ట్ సినిమాలకు ఫ్లాట్ ఫాం అయ్యింది. ఆ స్టోరీలేంటీ, ఆ నెరేషన్ ఏంటీ, ఆ స్క్రీన్ ప్లే ఏంటీ, అని సౌత్, నార్త్ బెల్ట్ చర్చించుకునేలా చేసింది. ఈ ఇయర్ గోల్డెన్ ఎరాను చూసిందనే చెప్పొచ్చు.
మంజుమ్మల్ బాయ్స్‌తో రేర్ రికార్డును సొంతం చేసుకుంది. 96 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ రూ. 200 క్రోర్ మూవీగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసిందీ మూవీ చాలా తక్కువ బడ్జెట్‌తో, ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీసును షేక్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఈ ఏడాదే కాదు ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది మాలీవుడ్ మూవీగా ఛేంజయ్యింది. ఇదే కోవలోకి వస్తుంది ప్రేమలు. యంగ్ టాలెంట్స్‌తో తెరకెక్కిన యూత్ అండ్ ఎంటర్ టైనర్ కూడా వంద కోట్లను క్రాస్ చేయడం మామూలు విషయం కాదు. ఈ ఏడాది చిన్న సినిమాలు ఎవ్వరూ ఎక్స్ పర్ట్ చేయని చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. కిష్కింద కాండం, వర్షంగళక్కు శేషం, అన్వేషిప్పన్ కండేతుమ్, ఉళోజుక్కు, సూక్ష్మదర్శిని లాంటి లో బడ్జెట్ చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. అటు సీనియర్స్ తో పాటు యంగ్ యాక్టర్స్ కూడా ఈ ఏడాది సత్తా చాటడమే కాదు రియల్ సక్సెస్ ఎలా ఉంటుందో చూపించారు