టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు పుష్పగుచ్చం అందజేశారు. అయితే జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరవహించనున్నారని ముందు నుంచి ఈ మేరకు ప్రచారం జరిగింది. ఉదయం మీటింగ్ లో ఈ ఈవెంట్ పర్మిషన్స్ అలాగే ఏర్పాట్ల విషయమై పవన్ తో దిల్ రాజు చర్చించారు. ఇక తాజాగా ఆఫ్ ది రికార్డుగా అందుతున్న సమాచారం మేరకు జనవరి 4వ తారీఖున రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.

ఈ ఫంక్షన్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్ కానుంది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌, సునీల్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గేమ్‌ ఛేంజర్‌ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *