Rewind Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు.

దర్శకుడు : కళ్యాణ్ చక్రవర్తి

నిర్మాతలు : కళ్యాణ్ చక్రవర్తి

సంగీత దర్శకుడు : ఆశీర్వాద్

సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్

ఎడిటర్ : తుషార పాలా

సంబంధిత లింక్స్: ట్రైలర్

సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వచ్చిన సినిమా ‘రివైండ్’. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కార్తీక్ (సాయి రోనక్) ఓ సాఫ్ట్ వేర్ డెవలపర్. శాంతి (అమృత చౌదరి)ని చూడగానే కార్తీక్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కార్తీక్ పై కొందరు పగ పట్టినట్టు ఎటాక్ చేస్తుంటారు. ఈ మధ్యలో కార్తీక్ – శాంతి మధ్య ప్రేమ కథ ఎంతవరకు వచ్చింది ?, అసలు శాంతి మనసులో ఏముంది ?, ఆమెకు కార్తీక్ ముందే తెలుసా ?, ఇంతకీ, కార్తీక్ గతం ఏమిటి ?, అతని జీవితంలో జరిగిన డ్రామా ఏమిటి ?, ఈ మొత్తం వ్యవహారంలో టైమ్ మిషన్ పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ రివైండ్ సినిమాలో టైమ్ ట్రావెల్ నావెల్టీ బాగుంది. నిజానికి ఇప్పటివరకూ టైమ్ బ్యాక్ డ్రాప్ లో చాలా చిత్రాలే చూసాం, కానీ ఈ చిత్రంలోని టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ బాగున్నాయి. హీరోగా నటించిన సాయి రోనక్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లవర్ బాయ్ లుక్ లో సాయి రోనక్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ అమృత చౌదరి తన నటనతో అలరించింది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన సీనియర్ నటుడు సురేష్ నటన చాలా బాగుంది.

అదేవిధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన బర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఫన్ బకెట్ రాజేష్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి టైమ్ మెషిన్ చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ రివైండ్ సినిమాలో తీసుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. సినిమాలో పెద్దగా కథ లేకపోవడం, కథనం కొన్ని చోట్ల లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే సినిమాలో ప్రధాన పాత్రల మధ్య నడిచే సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.

నిజానికి టైమ్ మెషిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ స్క్రీన్ ప్లే సాగాలి. కానీ, ఈ సినిమా అలా సాగలేదు. దీనికితోడు కొన్ని కీలక సన్నివేశాలు కూడా పేలవంగా అనిపిస్తాయి. మొత్తానికి ఈ రివైండ్ సినిమాలో ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ పై ఎక్కువ వర్క్ చేయాల్సింది. అదేవిధంగా టైమ్ ట్రావెల్ తాలూకు ట్రాక్ ను ఇంకా ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు కళ్యాణ్ చక్రవర్తి దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా విఫలం అయ్యారు. సంగీతం విషయానికి వస్తే.. ఆశీర్వాద్ అందించిన పాట‌లు ఫర్వాలేదనిపిస్తే, నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ శివ రామ్ చరణ్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు :

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ థిల్లర్ లో.. కొన్ని లవ్ మూమెంట్స్ అండ్ కొన్ని రివైండ్ సీన్స్ బాగున్నాయి. ఐతే.. సినిమాలో సింపుల్ స్టోరీ, కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నేరేషన్ తో సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో మెయిన్ థీమ్ మాత్రమే బాగుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *