Published on Dec 30, 2024 10:00 PM IST
మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2024 ఎన్నో జ్ఞాపకాలను టాలీవుడ్ అభిమానులకు మిగిల్చింది. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు తెలుగు సినిమా సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాయి. వాటిలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైఫై మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 ఎడి’ కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ ఫిల్మ్ రేటింగ్ సంస్థ ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాలో ‘కల్కి 2898 ఎడి’ నెంబర్ వన్ స్థానంతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాలోని కథ, విజువల్‌గా ప్రేక్షకులకు అందించిన ట్రీట్ ఈ చిత్రాన్ని ఇతర చిత్రాలతో ప్రత్యేకంగా చేశాయి. ఇక ఈ సినిమాలోని భారీ క్యాస్టింగ్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
ప్రభాస్‌తో పాటు ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.