Tue. Mar 24th, 2026

ట్యాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి నటించిన రివెంజ్ డ్రామా ‘శబ్దం’ 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ లభించింది. దర్శకుడు అరివళగన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని హారర్, ఎమోషన్ అంశాలు ప్రేక్షకులను కొంతవరకు మెప్పించాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ అయిన ఏడాది అయినా, ఇంకా డిజిటిల్ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్‌కు రాకపోవడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది.

కానీ, ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఏడాది దాటిన తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రావడంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. అయితే, ఓటీటీలో కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు స్ట్రీమింగ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని చాలా రోజులుగా ఎదురుచూసిన వారు ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఇప్పుడు జీ5లో వీక్షించే అవకాశం లభించింది. మరి కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ‘శబ్దం’ చేస్తుందో చూడాలి.

The put up ఏడాది తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆది పినిశెట్టి ‘శబ్దం’.. కానీ..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.