ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘AA22’ చిత్రంపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు సంబంధించి సౌత్‌తో పాటు నార్త్ ఇండియాలోనూ భారీ హైప్ నెలకొంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. కాగా, ఈ సినిమాలో హీరో బన్నీ పాత్రకు సంబంధించి ఓ క్లూ ఇచ్చాడు దర్శకుడు అట్లీ.
ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక లయన్ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్‌లో సింహం ముఖం రెండు వేర్వేరు భాగాలుగా కనిపిస్తూ, సినిమాలో బన్నీ పోషించబోయే పవర్‌ఫుల్ డ్యూయల్ రోల్ లేదా ఒక క్లిష్టమైన క్యారెక్టర్ ఆర్క్ గురించి హింట్ ఇస్తున్నట్లు ఉంది. ‘నీలా ఎవరూ ఉండలేరు, అదే నీ శక్తి’ అంటూ అట్లీ ఈ లయన్ పోస్టర్‌కు ఇచ్చిన కొటేషన్ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌డమ్ మరియు అట్లీ మాస్ టేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది. మరి అట్లీ షేర్ చేసుకున్న లయన్ పోస్టర్ నిజంగాన బన్నీ పాత్రను రివీల్ చేస్తుందా.. అనేది వేచి చూడాలి.
The publish AA22 : బన్నీ పాత్రపై అట్లీ హింట్.. ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారెంటీ! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
