Thu. Mar 26th, 2026
Pawan Kalyan: రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి!

రామ్ చరణ్ తేజ హీరోగా, బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా, ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, అది రిలీజ్ కాకపోవచ్చు అని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రామ్ చరణ్ తేజ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా, స్వల్ప గాయానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది.
సినిమాలో కీలకమైన ఒక స్టంట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.

Additionally Learn:Gautham Menon: డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టు కథ చెప్పిన స్టార్ డైరెక్టర్.. షాకిచ్చిన హైకోర్టు!

అయితే పెద్ద ప్రమాదం ఏమీ కాదు కానీ, ప్రస్తుతానికి రామ్ చరణ్ మళ్ళీ షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆయన రెస్ట్ తీసుకోబోతున్నారు. ‘పెద్ది’ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గాయం మీద స్పందించారు. ఈ మేరకు మీడియాకు సమాచారం అందించారు. త్వరగా రామ్ చరణ్ కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ టీం ఒక మెసేజ్ షేర్ చేసింది. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ కి గాయాలు అయినట్లుగా ‘పెద్ది’ టీం కానీ, రామ్ చరణ్ టీం కానీ ప్రకటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ స్పందించడంతో, ఈ వార్త కన్ఫామ్ అయినట్లయింది.