యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే రాకాస. టీజర్ ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ బయటకి వచ్చింది. మరి ఈ ట్రైలర్ సాలిడ్ గా ఉందని చెప్పొచ్చు.
డెఫినెట్ గా ఇది అంచనాలు పెంచే విధంగానే ఉంది. ఒక బ్రహ్మ రాక్షసుడుని పరిచయం చేస్తూ ఆసక్తికరమైన కథనం అంతకంటే ఆశ్చర్య పరిచే విజువల్స్ తో ఊహించని విధంగా ఈ ట్రైలర్ కనిపిస్తుంది. ఇక ఇందులోనే సంగీత్ శోభన్ ఎంట్రీ తర్వాత నుంచి మంచి ఫన్ మోడ్ లోకి ఈ ట్రైలర్ మారడం బాగుంది. అక్కడ నుంచి మంచి ఫన్ తో పాటుగా ప్లాన్ చేసిన అడ్వెంచర్ రైడ్ ని దర్శకురాలు ప్రామిస్ చేస్తున్నారు.
అలాగే ఇందులో సంగీతం కానీ ప్రొడక్షన్ డిజైన్ గాని టాప్ నాచ్ లో ఉన్నాయి. ఫైనల్ గా సంగీత్ పై స్పైడర్ మ్యాన్ తరహా కామెడీ భలే అనిపించింది. సో మొత్తానికి మాత్రం రాకాస తో మేకర్స్ సాలిడ్ ట్రీట్ ని ఈ ఏప్రిల్ 3న ప్రామిస్ చేస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The publish ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా సాలిడ్ విజువల్స్ తో థ్రిల్ చేసిన “రాకాస” first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
