Thu. Mar 26th, 2026
Priyanka Chopra: నిక్‌లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వారణాసి షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక.. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నారట. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె గట్టిగానే స్పందించారు. ‘మేము విడాకులు తీసుకుంటున్నామంటూ కొన్ని వార్తలు నా చెవిన పడ్డాయి. మా పెళ్లి బంధం ముగిసిపోవాలని కొందరు కోరుకుంటున్నారా? అనిపిస్తోంది. అసలు మా బంధం గురించి ఇలాంటి రూమర్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇదంతా వారి భ్రమ మాత్రమే. వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు, మా మధ్య ఉన్న వయసు తేడా వల్ల కొందరికి మా బంధం ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. కానీ మేము ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నాం. ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం నేను ఎప్పుడో మానేశాను’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.

Additionally Learn: Ranveer Singh New Film: రణవీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్, హీరోయిన్, టైటిల్ డీటెయిల్స్ ఇవే!

తమ వివాహ ప్రయాణం గురించి ప్రియాంక చోప్రా చెబుతూ… ‘మా పరిచయం తర్వాత కేవలం ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో అసలు ఏం జరుగుతుందో, అది నిజమో కాదో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. అయితే నిక్‌లో ఉన్న నిజాయతీ నన్ను ఆకర్షించింది’ అని చెప్పారు. కుటుంబ భద్రత విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని తెలిపారు. ‘నేను నా కుటుంబం, ముఖ్యంగా నా కుమార్తె భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరైనా నన్ను నేరుగా కలిసి ఫొటోలు తీసుకోవాలనుకుంటే నాకు ఇష్టమే. నాతో మాట్లాడటానికి వచ్చే వ్యక్తులను నేను గౌరవిస్తానని నా సెక్యూరిటీ గార్డులకు కూడా తెలుసు. కానీ అనుమతి లేకుండా దొంగ చాటుగా ఫొటోలు తీయడం నాకు నచ్చదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. మేము పార్కులో ఉన్నా లేదా ఎక్కడైనా భోజనం చేస్తున్నా.. ఆ పిక్స్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందుకే నా కూతురి ప్రైవసీ కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాను. లేకపోతే నాకు వ్యక్తిగత భద్రత అవసరం లేదు’ అని వివరించారు.