Thu. Mar 26th, 2026
Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా రామ్ చరణ్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. కంటి సమీపంలో చిన్న గాయం అవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ, ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని పెద్ది టీమ్ తెలిపింది. ఆయన తిరిగి సెట్స్‌లో కూడా పాల్గొనబోతున్నారని తెలిపారు. అయితే, చరణ్‌కు గాయం కారణంగా ‘పెద్ది’ నుంచి రావాల్సి అప్డేట్స్ రావేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, అలాంటిదేమి ఉండదని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న పెద్ది మాస్ ర్యాంపేజ్ చూస్తారని ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.

Additionally Learn: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!

మార్చి 27 ఉదయం 11:07 గంటలకు పెద్ది టీజర్ రిలీజ్ కానుంది. ఇక ఈ టీజర్ కుస్తీ పేరుతో రాబోతోంది. గతంలో ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా క్రికెట్‌కు సంబంధించిన షాట్స్ రివీల్ చేశారు. ఇప్పుడు రాబోయె టీజర్‌లో ‘కుస్తీ’కి సంబంధించిన షాట్స్ రివీల్ చేయనున్నారు. ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నట్టుగా మొదటి నుంచి టాక్ ఉంది. క్రికెట్‌తో పాటు కుస్తీకి సంబంధించిన కీలక సన్నివేశాలు సినిమాలో హైలెట్ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే క్రికెట్‌కు సంబంధించిన షాట్స్ వచ్చేశాయి కాబట్టి, ఇప్పుడు కుస్తీ పోరుకు సిద్ధమవుతున్నాడు పెద్ది. ఈ టీజర్ వచ్చాక సినిమా కథతో పాటు రామ్ చరణ్ మాస్ రోల్ పై మరింత క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.