Thu. Mar 26th, 2026
Dhurandhar 2 Box Office Collection: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోన్న ‘ధురంధర్ 2’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..

Dhurandhar 2 Field Place of business Assortment: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డులు సృష్టించింది. రూ.1,000 కోట్ల మార్క్‌ను చేరిన భారతీయ చిత్రాల్లో ‘పుష్ప 2’ సరసన చేరింది.. సాక్‌నిల్క్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం 7వ రోజు (బుధవారం) రూ.47.7 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 20,000కు పైగా షోల ద్వారా ఈ వసూళ్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియా నెట్ కలెక్షన్ రూ.623.42 కోట్లు కాగా, గ్రాస్ కలెక్షన్ రూ.744.58 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్లలో రూ.261.92 కోట్లు వసూలు చేసి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.1006.5 కోట్ల గ్రాస్‌ను అందుకుంది.

Learn Additionally: Donald Trump: “నాకు ఇరాన్ సుప్రీం లీడర్‌ పదవిని ఆఫర్ చేశారు.. కానీ”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ఈ చిత్రం త్వరలోనే కల్కి 2898 AD (రూ.1042 కోట్లు) కలెక్షన్లను దాటే అవకాశముంది. అలాగే, జవాన్ (రూ.1160 కోట్లు) లైఫ్‌టైమ్ రికార్డును కూడా చేరుకునే దిశగా దూసుకెళ్తోంది. ‘ధురంధర్ 2’ ప్రివ్యూ షోల ద్వారా మొదటి రోజే రూ.43 కోట్లు వసూలు చేసి భారీ ఓపెనింగ్ సాధించింది. మొదటి రోజు రూ.102.55 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ.80.72 కోట్లకు తగ్గింది. అయితే, వీకెండ్‌లో మళ్లీ జోరు పెంచి శనివారం రూ.113 కోట్లు, ఆదివారం రూ.114.85 కోట్లు వసూలు చేసింది. తర్వాత రోజుల్లో సోమవారం రూ.65 కోట్లు, మంగళవారం రూ.56.60 కోట్లు, బుధవారం రూ.47.70 కోట్లు రాబట్టింది.

ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు.. ఇందులో రణవీర్ సింగ్ అండర్‌కవర్ గూఢచారి పాత్రలో కనిపిస్తున్నారు. అండర్‌వరల్డ్‌లో జరుగుతున్న గూఢచారి ఆపరేషన్ నేపథ్యంలో కథ సాగుతుంది. మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్‌లో ట్విస్ట్‌లతో మిషన్‌ను పూర్తి చేయడం ప్రధానాంశంగా సాగింది.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తున్న ఈ సినిమా త్వరలోనే దేశీయంగా కూడా రూ.1,000 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.