Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. anna.konidala పేరుతో అధికారికంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించారు. పవన్ కళ్యాణ్‌తో దిగిన ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ.. చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావాలని అనుకున్నానని, ఇదే సరైన సమయమని భావించానని తెలిపారు. చిరంజీవి ఆశీస్సులు, భర్త పవన్ కల్యాణ్ సపోర్టుతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉందని తన మొదటి పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఫాలో అయ్యారు. ఆ లిస్ట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, మహేష్ బాబు, నమ్రత, సమంత తదితరులు ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన భార్యకు స్వాగతం పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఈ వేదిక పై అడుగుపెడుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు అంటూ ప్రత్యేకంగా పోస్ట్ చేశారు.
READ MORE: Mermaid: రేజర్ షార్ప్ పళ్లు, చేప తోకతో మమ్మీ.. జపాన్‌లో సగం చేప సగం మానవుడి మెర్మెయిడ్
అదే సమయంలో అన్నా లెజినోవా మరో భావోద్వేగ పోస్టుతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్ల క్రితం మెగా కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు.. ఇంత పెద్ద కుటుంబంలో ఎలా కలిసిపోవాలో తెలియక అయోమయంలో ఉన్నానని తెలిపారు. ఎవరిని ఎలా పిలవాలో కూడా తెలియలేదని.. అయితే భర్త పవన్ కల్యాణ్ సహకారంతో అన్నీ నేర్చుకున్నానని చెప్పారు. తనకు సహోదరులు లేరని.. కానీ చిరంజీవి, నాగబాబుల్లో సోదరులను చూసుకున్నానని ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు వరుసగా వెల్కమ్ పోస్టులు పెడుతుండగా.. అన్నా లెజినోవా సోషల్ మీడియా ఎంట్రీ ఇప్పుడు వైరల్‌గా మారింది.
READ MORE: Tirupati Horror: తల్లేనా.. తాటకా..! తరచూ పాల కోసం ఏడుస్తుందని చిన్నారిని చంపేసిన తల్లి..
