మెగా అభిమానులకు అన్నా కొణిదెల ఓ అందమైన సర్ ప్రైజ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, తన భర్త పవన్ కల్యాణ్‌లతో కలిసి ఉన్న ఓ క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరంజీవి ఎంతో ఆప్యాయంగా అన్నా కొణిదెల బుగ్గ పట్టుకుని నవ్విస్తుండగా, పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ వారిని చూసి మురిసిపోతున్నారు. అయితే ఈ ఫోటోతో పాటు ఆమె రాసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవిని, నాగబాబును తాను ఎందుకు ‘అన్నయ్య’ అని పిలుస్తానో ఈ పోస్ట్ ద్వారా అన్నా కొణిదెల వివరించారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం తాను ఈ మెగా కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు.. ఎవరిని ఏమని పిలవాలో, ఎలా కలిసిపోవాలో తనకు తెలిసేది కాదన్నారు. ఆ సమయంలో తన భర్త పవన్ వాడే పదాలనే తాను అరువు తెచ్చుకున్నానని చెప్పారు. అలా పవన్ పిలిచినట్లే తాను కూడా వాళ్ళను ‘అన్నయ్య, చిన్న అన్నయ్య’ అని పిలవడం మొదలుపెట్టానని గుర్తు చేసుకున్నారు.
బావగారు కాదు.. అన్నయ్యే
మొదట్లో కాస్త భయపడుతూనే ఆ పదాలను వాడినా.. రాను రాను అది ఒక ఫీలింగ్‌లా మారిపోయిందని అన్నా కొణిదెల తెలిపారు. నిజానికి వారిని మరోలా (బావగారు అని) పిలవాలని తనకు తర్వాత తెలిసిందని, కానీ అప్పటికే భాషతో సంబంధం లేకుండా వారి మధ్య ఓ ఎమోషనల్ బాండ్ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. “నాకు సొంత అన్నయ్యలు లేరు.. కానీ జీవితం చాలా సైలెంట్‌గా నాకు ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది” అంటూ చిరంజీవి, నాగబాబులను ట్యాగ్ చేస్తూ తన ప్రేమను చాటుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోతో పాటు అన్నా కొణిదెల రాసిన క్యాప్షన్ మెగా అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆ కుటుంబం తనను ఆదరించిన తీరును ఆమె వ్యక్తపరిచిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
The put up బావగారు కాదు.. అన్నయ్యే: చిరంజీవిపై పవన్ కల్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
