బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న ‘ధురంధర్ ది రివెంజ్’ (ధురంధర్ 2) సినిమాపై ఎట్టకేలకు ఒక ఖాన్ స్పందించారు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో దేశవ్యాప్తంగా మూవీ టీమ్‌పై ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ మూవీ విజయంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అయితే, ఇక్కడే ఆయనో చిన్న ట్విస్ట్ ఇచ్చారు.
సినిమా చూడకపోయినా..
నిజానికి ఆమిర్ ఖాన్ ఇంకా ‘ధురంధర్ 2’ సినిమా చూడలేదు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. “నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. కానీ సినిమా గురించి అంతా చాలా గొప్పగా చెబుతున్నారు. బయట ఎక్కడ విన్నా ప్రశంసలే వినిపిస్తున్నాయి” అని ఆమిర్ చెప్పుకొచ్చారు. కేవలం ఈ సీక్వెల్ మాత్రమే కాదు.. మొదటి భాగం ‘ధురంధర్ 1’ కూడా పెద్ద హిట్ అని ఆయన గుర్తుచేశారు.
ఈ రెండు సినిమాలు అద్భుతమైన వసూళ్లు రాబట్టాయని, ప్రేక్షకుల నుంచి అసాధారణమైన స్పందన తెచ్చుకున్నాయని ఆమిర్ ఖాన్ కొనియాడారు. ఈ సందర్భంగా ‘ధురంధర్’ చిత్ర బృందానికి ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా చూడకపోయినా, దాని ఇంపాక్ట్ ఏంటో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఓపెన్‌గా మెచ్చుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The publish ఎట్టకేలకు ‘ధురంధర్ 2’పై స్పందించిన ఖాన్.. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
