Thu. Mar 26th, 2026

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదల తేది కోసం రచ్చ అలా నడుస్తోంది. మేకర్స్ ఫిక్స్ చేసిన డేట్ ఏప్రిల్ 30 కూడా అనుమానమే అన్నట్టు పలు రూమర్స్ వినిపించాయి కానీ మేకర్స్ అప్డేట్స్ తో డేట్ ని అదే ఉంచారు.

కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారినట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఈసారి ఏప్రిల్ చివరి నుంచి మే మధ్యలోకి వెళ్లినట్టు వినిపిస్తోంది. దీనిపై మాత్రం క్లారిటీ ఈ మార్చ్ 27 చరణ్ పుట్టిన రోజునే రావచ్చని చెప్పాలి. సో ఆరోజుతో రిలీజ్ ఏప్రిల్ లో ఉంటుందో లేక మే లోనా అనేది తేలిపోతుంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

The publish మళ్లీ ‘పెద్ది’ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.