బాలీవుడ్ లేటెస్ట్ గా డెలివర్ చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రమే ధురంధర్ 2. దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్వీర్ సింగ్ కలయికలో వచ్చిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామా భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. అయితే పార్ట్ 1 తెలుగు విడుదల లేకుండానే హైదరాబాద్ సిటీలో భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పార్ట్ 2 హిందీ, తెలుగు కలిపి పలు మల్టీప్లెక్స్ లలో ఊచకోత కోస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం 8 మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా 1 కోటికి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల ఆరంభించిన అల్లు సినిమాస్ లో ధురంధర్ 2 అత్యధిక ఆక్యుపెన్సీ లతో దూసుకెళ్తుందట. సో ఇలా మొత్తానికి ఈ సినిమా నెవర్ బిఫోర్ రన్ ని హైదరాబాద్ ప్లెక్స్ లలో చూస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో సారా అర్జున్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.
The put up హైదరాబాద్ ఫ్లెక్స్ లలో ‘ధురంధర్ 2’ ఊచకోత.. అల్లు అడ్డాలో అత్యధికం! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
