శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రామాయణ ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమాల నుండి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పవిత్ర రోజున సినిమాకు సంబంధించిన ఏదైనా గ్లింప్స్ విడుదలవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
నేడు ఎటువంటి గ్లింప్స్ విడుదల చేయడం లేదని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి బదులుగా, ఏప్రిల్ 2, 2026న హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరాముడి మొదటి గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవిలను రాముడు, సీత పాత్రల్లో చూడాలనుకున్న అభిమానులకు ఈ వేచి ఉండటం కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ, టీమ్ మాత్రం మరింత హైప్ క్రియేట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో యష్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ మరియు రవి దూబే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ మరియు హన్స్ జిమ్మర్ వంటి దిగ్గజాలు సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే సమకూర్చుతున్నారు. ఈ చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’ పేరుతో 2026 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
The put up శ్రీరామ నవమి పర్వదినం మిస్ చేసిన రామాయణ.. కానీ ఓ సాలిడ్ అప్డేట్..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
