ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సునామీ సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది, కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఇండియన్ సినిమాగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద ఒక కొత్త అధ్యాయం మొదలైంది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని కొనసాగిస్తోంది. విడుదలైన తొలి వారం (8 రోజులు) ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా ₹1088 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
Additionally Learn:Peddi Glimpse Evaluate: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్డే ట్రీట్ చరణ్ అన్న!
ఇండియాలో తొలి వారం వసూళ్ల ప్రస్థానం:
కేవలం వీకెండ్లోనే కాకుండా, వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమా అదే జోరును ప్రదర్శించడం విశేషం.
మొదటి వీకెండ్: ₹466 కోట్లు
సోమవారం: ₹64 కోట్లు
మంగళవారం: ₹58 కోట్లు
బుధవారం: ₹49 కోట్లు
గురువారం: ₹53 కోట్లు
మొత్తం ఇండియా నెట్ వసూళ్లు: ₹690 కోట్లు
మొత్తం ఇండియా గ్రాస్ వసూళ్లు: ₹814 కోట్లు
ఓవర్సీస్లోనూ జోరు
కేవలం ఇక్కడే కాకుండా, విదేశీ మార్కెట్లలో కూడా ధురంధర్ హవా కొనసాగుతోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం వారం రోజుల్లో ₹274 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వెరసి, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు ₹1088 కోట్లు దాటేశాయి. ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్, ఉత్కంఠ రేకెత్తించే స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు గత సినిమా ‘ధురంధర్’కు ఉన్న క్రేజ్ ఈ చిత్రానికి అద్భుతమైన మైలేజీని ఇచ్చాయి. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా 1000 కోట్ల మార్కును అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలవడమే కాకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తుడిచిపెట్టేలా కనిపిస్తోంది.
