మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన తన లేటెస్ట్ చిత్రం పెద్ది నుంచి వచ్చిన పహిల్వాన్ టీజర్ ఓ రేంజ్ లో కిక్ ఇస్తూ పాన్ ఇండియా లెవెల్లో మరింత హైప్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ టైం వస్తున్నట్టు ఈ సాలిడ్ గ్లింప్స్ తో ఖరారు చేసేసారు. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ నార్త్ ఇండియాలో గ్రాండ్ రిలీజ్ కి ఇప్పుడు డీల్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కన్ఫర్మ్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ సినిమాని నార్త్ ఇండియాలో సెన్సేషన్ సెట్ చేసిన ధురంధర్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్ వారు పెద్ది హిందీ హక్కులు సొంతం చేసుకున్నారట. ఇది మాత్రం పెద్ది కి బిగ్ మూవ్ అనే చెప్పొచ్చు. సో హిందీలో ఈ సినిమా ఈ రేంజ్ రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The publish నార్త్ లో ‘పెద్ది’ కోసం ‘ధురంధర్’ మేకర్స్ భారీ ఆఫర్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
