మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే పెద్ది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వదిలిన మట్టి కుస్తీ విజువల్స్ టీజర్ తో సాలిడ్ హైప్ సెట్ అయ్యింది. అయితే ఈ సినిమాకి కెమెరా వర్క్ రత్నవేలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆ మధ్య తను ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ కి పాత కాలంలో వినియోగించే కెమెరా రీల్ సెటప్ తో అద్భుతమైన సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలిపారు. మరి ఆ సన్నివేశాలే ఇప్పుడు వచ్చిన మట్టికుస్తీ విజువల్సా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. చాలా సహజంగా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సీన్స్ కనిపిస్తున్నాయి. దీనితో అపుడు రత్నవేలు చెప్పిన ఎపిసోడ్ ఇదే కాబోలు అని సినీ వర్గాల్లో సహా సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది.
The publish ‘పెద్ది’లో ఈ సీక్వెన్స్ వింటేజ్ ప్రయోగమేనా? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
