హైదరాబాద్: గోదావరిఖనిలోని సింగరేణి క్వార్టర్ కూల్చివేత బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును కలిశారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ దౌర్జన్యం చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. లక్ష్మీ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి పేరుతో సింగరేణి క్వార్టర్స్ కూల్చివేశారని బాధితులు కేటీఆర్ కు వివరించారు.

కూల్చివేతలకు ముందు 82 క్వార్టర్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు తెలిపారు. అసెంబ్లీలో తమకు జరిగిన అన్యాయంపై చర్చించాలని కేటీఆర్‌ను కోరారు.

వారి విజ్ఞప్తిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.