నిజ జీవితంలోని పాత్రలను చూసే ‘గేమ్ ఛేంజర్’ చేశాం – రామ్ చరణ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

‘గేమ్ ఛేంజర్’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనదైన పద్ధతిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఈవెంట్ కోసం ఎంతో మాట్లాడాలని ప్రిపేర్ అయ్యానని.. అయితే, ఇప్పుడు సమయం తక్కువగా ఉండటంతో కొంతవరకే మాట్లాడుతానని చరణ్ తెలిపాడు.

ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం దర్శకుడు శంకర్ నిజజీవితంలోని పాత్రలు చూసి కథను రెడీ చేశారని.. ఆ పాత్రలు ఏమిటనేవి మన అందరికీ తెలుసు.. ఏపీ రాజకీయాల్లోనే కాదు.. ఇండియన్ పాలిటిక్స్‌లోనే నిజమైన గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని చరణ్ అన్నాడు. ఎంతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు సమయం కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని చరణ్ పేర్కొన్నాడు.

ఇలా చరణ్ కొద్దిగా మాట్లాడినా, అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

The post నిజ జీవితంలోని పాత్రలను చూసే ‘గేమ్ ఛేంజర్’ చేశాం – రామ్ చరణ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *