బ్లాక్ అండ్ వైట్‌ ఫ్రేమ్స్‌లోనే ‘బఘీర’ ట్రైలర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

కన్నడ స్టార్ హీరో శ్రీ మురళి హీరోగా సూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘బఘీర’. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో ఈ సినిమా రాబోతుండటం విశేషం. అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్’ చాలా బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేస్తూ సాగింది. అలాగే, హీరో పాత్రను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ రివీల్ చేశారు. ముఖ్యంగా కథలోని ఎమోషన్స్ ను చాలా బాగా డిజైన్ చేశారు.

మొత్తానికి ఈ ట్రైలర్ అదిరిపోయింది. భారీ విజువల్స్ అండ్ క్రేజీ ఎలివేషన్స్ తో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఈ ట్రైలర్ ను చూస్తుంటే.. ఈ సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్‌ ఫ్రేమ్స్‌లోనే తెరకెక్కింది. మొత్తానికి కేజీఎఫ్ సినిమాకి కాపీలాగే ఈ సినిమా ఉంటుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని హొంబలె ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ నెల 31న ‘బఘీర’ విడుదలవనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The post బ్లాక్ అండ్ వైట్‌ ఫ్రేమ్స్‌లోనే ‘బఘీర’ ట్రైలర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *