మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ ఓవర్సీస్ విడుదలకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు సెకండ్ హాఫ్ కంటెంట్ అక్కడికి చేరింది. దీనిని ఓవర్సీస్లోని అన్ని ఎలక్ట్రానిక్ లొకేషన్లకు విజయవంతంగా పంపడం జరిగిందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ కంటెంట్ డౌన్లోడ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల ద్వారా కంటెంట్ ప్రదర్శించే లొకేషన్ల కోసం, రేపు ఉదయం షిప్మెంట్ ప్రారంభం కానుంది. ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అన్నీ సోమవారం నాటికి ఆయా లొకేషన్లకు చేరుకుంటాయి. దీనివల్ల ఓవర్సీస్ ప్రీమియర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా లైన్ క్లియర్ కానుంది.
మరోవైపు, హిందీ వర్షన్‌కు సంబంధించిన ఫస్ట్ హాఫ్ కంటెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇప్పటికే కన్ఫర్మ్ అయిన అన్ని ఎలక్ట్రానిక్ థియేటర్ లొకేషన్లకు పంపించారు. హిందీ సెకండ్ హాఫ్ కంటెంట్ ఈ రాత్రికి చేరే అవకాశం ఉంది. దీంతో పాటు తమిళ, మలయాళ భాషల వెర్షన్ల కంటెంట్ అప్డేట్స్ కూడా త్వరలోనే రానున్నాయి. మొత్తానికి పెద్ది ప్రీమియర్ షోలతో రామ్ చరణ్ ఓవర్సీస్ మార్కె్ట్‌ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
The put up ఓవర్సీస్కు ‘పెద్ది’ కంటెంట్.. పరిస్థితి ఇదే..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
