టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఏడాది ఆరంభంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాజా సాబ్’ చిత్రంతో ఊహించని భారీ నష్టాలను చవిచూసింది. ఈ పెద్ద ఎదురుదెబ్బతో అలర్ట్ అయిన పీఎంఎఫ్, ప్రస్తుతం తమ నిర్మాణ వేగాన్ని కాస్త తగ్గించి, భవిష్యత్తు ప్రాజెక్టులపై ఆచితూచి అడుగులు వేస్తోంది. 2027 నాటికి బలమైన లైనప్‌ను సిద్ధం చేసే పనిలో పడింది. ప్రస్తుతానికి తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్ 2’ షూటింగ్ దశలో ఉంది, ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే, తేజ సజ్జతోనే ‘జాంబీ రెడ్డి 2’ చేయడానికి కూడా పీఎంఎఫ్ ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఒక క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కోసం పీఎంఎఫ్ టీమ్ ఒక అద్భుతమైన ఐడియాను డెవలప్ చేయగా, దానికి టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడి ఎంపిక తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
గడిచిన కొన్నేళ్లుగా టైగర్ ష్రాఫ్‌కు సరైన మాస్ హిట్ పడలేదు. అయినప్పటికీ, ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్షన్ హీరో క్రేజ్ మరియు మార్కెట్‌ను నమ్మి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్‌లో ఈ భారీ అడుగు వేస్తోంది. మరి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం పీపుల్ మీడియా ఎలాంటి కథతో రాబోతుందో చూడాలి.
The publish బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెడుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
