Sobhita: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య శోభిత నిశ్చితార్థం హాట్ టాపిక్ గా మారింది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య తన సినిమాలపై ఫోకస్ పెట్టారు అయితే పలు సందర్భాలలో ఈయన శోభితతో కలిసి కనిపించడంతో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తల గురించి వీరికి ప్రశ్నలు ఎదురైనా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు.

ఈ విధంగా నాగచైతన్య సమంత ఇద్దరు కూడా వారి రిలేషన్ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక ఇటీవల వీరిద్దరూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోవడంతో శోభిత గురించి అభిమానులు పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలుపెట్టారు.

శోభిత ఎక్కడ పుట్టింది ఏం చదువుకుంది ఆమె సినీ కెరియర్ ఏంటి అనే విషయాల గురించి కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఈమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ వీడియోస్ ని కూడా ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య కంటే ముందుగా శోభితకు మరొక వ్యక్తితో ఎఫైర్ ఉండేది అనే వార్త కూడా వైరల్ అవుతుంది.

ప్రణవ్ మిశ్రా…
శోభిత నాగచైతన్య కంటే ముందుగా ఎవరి ప్రేమలో పడ్డారనే విషయానికి వస్తే ఈమె ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ , లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రాతో ప్రేమలో పడ్డారు. వారు 2019లో ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో కలుసుకున్నారని ఆ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. అయితే వీరి ప్రేమ ప్రయాణం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు ఇలా తనకు బ్రేకప్ చెప్పిన ఈమె అక్కినేని ఇంటి కోడలు అడుగుపెట్టబోతున్నారు.