Wayanad Helping : ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిన పడిన ప్రమాదం యావత్ దేశాన్నే కలిచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 390 మందికి పైగా మృతి చెందగా మరో 200 మందికి గాయాలయ్యాయి. ఇంకో 150 మంది ఆచూకీ గల్లంతయింది. ఈ ఘటనలో అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు విరాళాలు అందిస్తున్నారు. ఈ ప్రమాద బాధితుల కోసం తామున్నామంటూ పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అనేకమంది సినిమా సెలబ్రిటీలు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందచేశారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా తన వంతు సాయాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మాత్రమే కాకుండా మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు, రష్మిక 10 లక్షలు, నిర్మాత నాగవంశీ 5 లక్షలు.. ఇలా పలువురు సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. తమిళ, మలయాళ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేకమంది ప్రముఖులు విరాళాలు అందచేశారు.

Read Also:Manda Krishna Madiga: తెలంగాణలో మాదిగలకు ఒక్క సీటు లేదు..

అయితే తాజాగా అలనాటి దక్షిణాది హీరోయిన్లు అంతా కలిసి డబ్బులు పోగేసి కోటి రూపాయలను కేరళ సీఎం పినరయి విజయన్ కు అందచేశారు. మీనా, కుష్బూ, సుహాసిని, మరికొంతమంది డైరెక్ట్ గా వెళ్లి కేరళ సీఎంకు కోటి రూపాయల చెక్కు అందచేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ సీనియర్ నటి మీనా తన సోషల్ మీడియాలో.. ‘‘చెన్నై నుంచి మేము కొంతమంది మా ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తరపున వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల డబ్బులు పోగేసాం. కేరళ సీఎం పినరయి విజయన్ గారిని కలిసి కోటి రూపాయల చెక్కుని అందించాము. ఇందుకు సహకరించిన సుహాసిని, శ్రీప్రియ, కుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిస్సి లక్ష్మి, శోభన.. వీరి ఫ్యామిలీలకు అభినందనలు. వయనాడ్ కోసం మేము ప్రార్ధిస్తున్నాము’’ అని పోస్ట్ చేసింది. దీంతో సీనియర్ నటీనటులు చేసిన ఈ పనికి వారికి అంతా అభినందనలు తెలుపుతున్నారు.

Read Also:Hijab: “ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు”.. హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..