Harikrishna నందమూరి హరికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఎంతో గంభీరమైనటువంటి వ్యక్తి అనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన కూడా నటుడిగా పలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాలలో కూడా హరికృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కళ్యాణ్ రామ్ గతంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన ఒక చిన్న గొడవ గురించి బయటపెట్టారు. నాన్న నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక వైవిఎస్ చౌదరి గారు నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి సన్నిహితులు అనే విషయం మనకు తెలుసు అదే సమయంలోనే కళ్యాణ్ కోయంబత్తూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారట.

ఇలా ఇంటికి వచ్చిన కళ్యాణ్ రామ్ తో వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ నీకు ఒక సినిమా కథ వినిపిస్తానని లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కథ వినిపించారు కథ తనకు అద్భుతంగా నచ్చడంతో ఈ సినిమాని నాన్నతో చేయాలనుకున్నాను ఎలాగైనా నాన్నని నువ్వే ఒప్పించాలి ఈ సినిమాకు నేనే నిర్మాతగా ఉంటానని వైవిఎస్ చౌదరి చెప్పారట. ఇక ఈ కథ నచ్చడంతో హరికృష్ణని ఎలాగైనా ఒప్పించాలని కళ్యాణ్ రామ్ తన వెంటే తిరిగేవాడు.

ఒకరోజు ఇదే విషయం గురించి హరికృష్ణ దగ్గర చెప్పడంతో కథ బాగుంది కానీ వైవిఎస్ చౌదరి నిర్మాత అంటే ఇబ్బంది పడతాడేమోనని ఆలోచనలో పడ్డారట హరికృష్ణ ఇలా ఆయన ఆలోచిస్తూ ఉండడంతో వెంటనే కళ్యాణ్ రామ్ మీరు హీరోగా నటించండి ఈ సినిమాని నేను నిర్మిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా హరికృష్ణ షాక్ అయ్యారట. ఈ విషయం గురించి గొడవ పడి కొద్ది రోజులు ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని కళ్యాణ్ రామ్ తెలిపారు.

ఉన్నత చదువులు చదవాలి..
కొద్దిరోజుల తర్వాత నాన్న వచ్చి నేను ఈ సినిమా చేస్తాను కానీ నువ్వు ఇంట్లో ఉండకూడదు యుఎస్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పారట అలా తండ్రి మాట ప్రకారం ఈయన యుఎస్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి కొద్ది రోజులు జాబ్ కూడా చేశారు అయితే జానకిరామ్ అన్నయ్య ఒకరోజు ఫోన్ చేసి నీకు సినిమాలంటే ఇంట్రెస్ట్ కదా ఇండియా వచ్చేసి సినిమాలు చేయొచ్చు కదా అని చెప్పారట. అలా ఇండియా వచ్చిన నేను నాన్నగారికి చెబితే ఆయన కూడా సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారని కళ్యాణ్ రామ్ తన తండ్రికి తనకు మధ్య జరిగిన గొడవ గురించి వెల్లడించారు.