• పరువు హత్యలపై తమిళ నటుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు..

  • హింస కాదు.. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అంటూ కామెంట్స్..

  • ఆయన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న నెటిజన్లు..

Honour killing: తమిళ నటుడు-దర్శకుడు రంజిత్ “పరువు హత్యల”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా జరిగే పరవు హత్యల్ని హింసగా చూడలేమని అన్నారు. రంజిత్ ఇలా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఆగస్టు 9న తమిళనాడు సేలంలో తాను ఇటీవల దర్శకత్వం వహించిన ‘కవుందంపాళయం’ సినిమా గురించి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Shravya Varma: బ్యాడ్మింటన్ ప్లేయర్ తో రాంగోపాల్ వర్మ మేనకోడలు ప్రేమాయణం.. త్వరలో పెళ్లి?

‘‘కులం ఆధారంగా పరువు హత్య హింస కాదు, అతి వారి పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే ప్రేమ’’ అని అన్నారు. ‘‘ఒక బైక్ దొంగలించబడితే, ఏం జరుగుతుందో మనం చూస్తు్న్నాం, పిల్లల జీవితం అంటే ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపిస్తారు, అలాంటి సమయాల్లో కోపం చూపిస్తారు, ఇది హింస కాదు, వారి పిల్లల పట్ల శ్రద్ధ’’ అని చెప్పారు. రంజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. గతంలో ‘‘పొట్టి బట్టలు వేసుకునే స్త్రీలు మరియు అందరి ముందు డ్యాన్స్ చేస్తారు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన కవుందంపాళయం కూడా కుల ఆధారిత హింస ఆధారంగా ఉంది. పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ వంటి వివాదాస్పద అంశంతో తెరకెక్కింది. ‘‘ మా భూముల్లో వ్యవసాయం చేయడం ముఖ్యం కాదు, మహిళకు గర్భం చేయడం ముఖ్యం’’ అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్ ఉంది.

రంజిత్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మందిపడుతున్నారు. ‘‘రంజిత్, మీరు ఒక గీతను దాటారు. పరువు హత్య అనేది ప్రేమ కాదు, అనాగరికం. మీ మాటలు అజ్ఞానం మాత్రమే కాదు, ప్రమాదకరమైనవి. ఇది కేవలం ‘తల్లిదండ్రుల మార్గం’ కాదు, ఇది హత్య. మీరు మా సమాజంలో చోటు లేని విషపూరిత మనస్తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు.’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.