• శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
  • ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేసిన భట్టి విక్రమార్క.

చంద్రగిరిలోని మంచు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబియు మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు.  ఆయనతో పాటు శ్రీ విద్యానికేతన్ వైస్ ఛాన్స్ లర్, సినీ నటుడు మంచు విష్ణుతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

Also Read: Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..?

శ్రీ విద్యానికేతన్ ఛైర్మన్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ” విద్యా దానం, క్రమశిక్షణ, చదువు, దారితప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32సంవత్సరాలు క్రితం కృషి పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగుపెట్టడం జరిగింది. ఉన్నత విద్యనందిస్తూ నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నాం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీస్సులతో అటు సినిమా పరిశ్రమలోనూ, ఇటు విద్య రంగంలోనూ ఈ స్థాయి చేరుకోవడం జరిగింది. నాకు కొద్దిగా ఆవేశం, ఎమోషన్ ఎక్కువ. ఒక సినిమా నటుడిగా నాకు జన్మనిచ్చింది పద్మ శ్రీ దాసరి నారాయణరావు. ఈ వేడుకకు విశిష్ట అతిథిదిగా విచ్చేసిన భట్టి విక్రమార్క మల్లు అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి. అందుకే ఆయనను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి తర్వాత అదే స్థాయి పంచకట్టు తో కనిపించే వ్యక్తి భట్టి విక్రమార్క. 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత భట్టిది. చిన్నవాడైన ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి, తండ్రి, దైవాన్ని మరిస్తే పుట్టకథలు ఉండవు. కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేథస్సు అందరికి ఉపయోగపడాలి.ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన విద్యార్థులకు నా అభినందనలు” అని తెలిపారు.