“పొట్టేల్” టీం కాన్ఫిడెన్స్.. ముందే తమ పొట్టేలును తీసుకొస్తున్నారు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 22, 2024 10:05 PM IST

ఇటీవల మన టాలీవుడ్ దగ్గర మంచి బజ్ తెచ్చుకొని చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసలు అందుకుంటున్న చిత్రం “పొట్టేల్”. యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల అలాగే యువ చంద్ర ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఇంటెన్స్ రస్టిక్ సినిమా ఇది. అయితే ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ వినూత్న ప్రమోషన్స్ చేస్తూ వెళుతున్నారు అలాగే అదే సమయంలో పలు నెగిటివ్ కామెంట్స్ ని కూడా ఎదుర్కొన్నారు.

అయితే చిత్ర యూనిట్ అంతా తమ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉండగా దానిని మరింత స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇలా ఓ రోజు ముందే పొట్టేల్ ని థియేటర్స్ లోకి వదులుతున్నట్టు తెలుస్తోంది. ఈ వారం 24న ప్లాన్ చేసిన ఈ సినిమాని ముందు రోజు సాయంత్రం నుంచే పైడ్ ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో తాము ఎంత నమ్మకంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా వారి అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *