World Organ Donors Day 2024: ఒక్కసారి కళ్ళుమూసుకోండి.. మన కళ్ళు కాసేపు పనిచేయడం లేదు అని ఊహించుకోండి.. పది నిమిషాలు అలా కళ్ళు మూసుకునే మీ పనులు చేయడానికి ప్రయత్నించండి. పది నిమిషాలు అనుకున్నా.. మీరు పది సెకన్లు కూడా అలా ఏ పనీ చేయలేరు. ఎందుకంటే, కళ్ళు లేని ఆ స్థితిని అలవాటు పడటానికి మనకి చాలా సమయం పడుతుంది. మరి ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదంలో లేదా వ్యాధి కారణంగా కళ్ళు కనిపించడం మానేస్తే.. వారి పరిస్థితి ఏమిటి? అవును ఒక్క కళ్ళు అనే కాదు.. మన శరీరంలో ఏ అవయవమైనా పనిచేయడం మానేస్తే దాని వలన మనం పడే ఇబ్బంది చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే, వైద్య శాస్త్రం ఆధునికతను సంతరించుకుంది. ఇప్పుడు ఇలా ఎవరికైనా అకస్మాత్తుగా ఏవైనా కొన్ని అవయవాలు పనిచేయకుండా పోయిన సందర్భంలో ఇతరుల అవయవాలను అమర్చి వారికి మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దీనికోసం చనిపోయిన వ్యక్తి అవయవాలను ఉపయోగిస్తారు. అయితే, అలా అవయవాలను ఇవ్వడానికి చనిపోయిన వ్యక్తి బ్రతికి ఉండగానే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దానినే అవయవదానం అని పిలుస్తారు. ఈరోజు అంటే.. ఆగస్టు 13 ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఈ సందర్భంగా అవయవదానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.