Sangeetha: ఒక్క ఛాన్స్ ఓకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు నటి సంగీత. కృష్ణ వంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ రవితేజ వంటి వారు నటించిన ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సంగీత అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా ఈమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు..
ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగీతం తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో తల్లి అక్క పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే హీరోయిన్ గా కొనసాగుతున్న సంగీత 2009వ సంవత్సరంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈమె తన పెద్దలకు ఇష్టం లేని వివాహం చేసుకున్నారు. సంగీత భర్త పేరు క్రిష్. పెద్దలను ఎదురించి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరార్ ఆలయంలో క్రిష్, సంగీత ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇలా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో ఇరువురి కుటుంబ సభ్యుల నుంచి వీరికి ఎలాంటి సపోర్ట్ లేదు దీంతో ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు పడిన వీరిద్దరూ పలు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయే స్టేజ్ కి వచ్చారు కానీ కొద్ది రోజుల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని తిరిగి వారి బంధంలో సంతోషంగా కొనసాగుతున్నారు.
సంగీత భర్త కూడా హీరోనేనా..
ఇలా 2009వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగీతకు 2012 వ సంవత్సరంలో శివియా అనే కూతురు జన్మించింది. ఇకపోతే సంగీత భర్త క్రిష్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడే. అతను తమిళ్ మరియు తెలుగు భాషా చిత్రాల్లో పనిచేసిన నేపథ్య గాయకుడు పనిచేశారు. అలాగే 2015 లో పురియధ ఆనందం పుతితగ ఆరంభం అనే కోలీవుడ్ మూవీలో హీరోగా కూడా పనిచేశారు కానీ అనుకున్న స్థాయిలో హీరోగా సక్సెస్ అందుకోలేకపోయారు.